Breaking

Saturday, December 12, 2020

సంచలనం ఐదవ వారం

                  సంచలనం నాల్గవ వారానికి సంబంధించిన కథ చదవాలంటే ఈ క్రింది లింకు క్లిక్ చేయండి.

https://manakatalu.blogspot.com/2020/12/blog-post_4.html


          పట్టణానికి వెళ్ళిన తల్లీదండ్రులు చీకటి పడినా రాకపోయే సరికి భయంతో, మరోపక్క పండుగకి క్రొత్త బట్టలు తెస్తారని సంతోషంతో ఎదురుచూస్తుంటారు.  అనిల్ వాళ్ళ అమ్మ పిల్లలకి ధైర్యం చెబుతున్నా వినకుండా గడప దగ్గరే అన్నం తిని ఎదురుచూసి చూసి అక్కడే నిద్రపోతారు.  అటువైపుగా కారులో వచ్చిన వారు క్రిందపడి కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న ఆ ఇద్దరిని  చూసి ఆసుపత్రికి తీసుకెళ్తారు. జేబులో ఉన్న పత్రాలను చూసి వారి ఊరికి చెందిన వారిని పిలిపిస్తారు. వారు పాలడైైైరీ నడుపుతున్న విజయ, నారాయణలు అని గుర్తించి  అనిల్ కి ఫోన్ చేస్తారు. ఆ ఊరి పెద్దలు అనిల్ వాళ్ళ అమ్మ కి చెప్పాలని ఇంటికి వచ్చి తలుపుకొట్టడంతో ఆ శబ్దం విని అమ్మానాన్నలు వచ్చారని నిద్ర నుండి మేలుకుంటారు. వచ్చిన వాళ్ళని చూసి అమ్మానాన్నలు వచ్చారా? అని ప్రశ్నిస్తారు. ఏమి చెప్పాలో తెలియక రాలేదని చెప్పి  లోపలికి వెళ్ళి ముసలామెకి విజయ, నారాయణల విషయం చెప్పిసరికి కళ్ళు తిరిగి క్రింద పడిపోయిన ముసలామెకు మొహం మీద నీళ్ళు కొట్టి  ఆమె కొంచెం తేరుకున్నాక ఆసుపత్రికి వెళ్ళదాము అని చెప్తారు.

                      ఆ ముసలామె ఎవ్వరికి అన్యాయం చేయని విజయ, నారాయణలకు అలా అయినందుకు బోరున ఏడుస్తుంటే పిల్లలు చూసి తల్లిదండ్రుల గురించి మరిచిపోయి, భయపడుతుంటారు. అంతలో ఫోన్ మోగటం ప్రారంభమవుతుంది. వేగంగా వెళ్ళి ఫోన్ తీయగానే కొడుకు ‌అని తెలియగానే ఏడుస్తూ విషయం చెప్పబోతుంది. అనిల్ తల్లితో  ప్రక్కన ఉన్న పిల్లలకు విషయం తెలియకుండా చూసుకో, నేను రేపటికి వచ్చేస్తానని చెప్తాడు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని పెద్దలను వీరి దగ్గర నేను ఉంటాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని ఇంట్లోకి వెళ్ళి ధనం కొంత తెచ్చిస్తుంది. పెద్దలు ధనాన్ని తిరస్కరించి నారాయణ మాకు మిత్రుడే ఈ సమయంలో మేము డబ్బు గురించి ఆలోచించము అని వెళ్ళిపోతారు. పిల్లలు నారాయణ అనే పేరు వినడం, ముసలామె ఏడవడం చూసి తండ్రికి ఏమయిందని?  ఏడుస్తూ అడుగుతారు.

                     చరణ్ తనకి దక్కిన అదృష్టాన్ని భార్యతో ఇప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా, నమ్మకంగా పని చెయ్యాలని వివరిస్తాడు. శరత్ కీర్తీకి మనం వేరే ఫ్లాట్ కి మారుతున్నామని  చెప్పగానే మంచి నిర్ణయం తీసుకున్నావని ప్రోత్సహిస్తుంది.‌ కీర్తి నువ్వు ఒప్పుకుంటావా? లేదా అనే భయంతో ఉన్నాను. నిన్ను ఎలా ఒప్పించాలి అనే ఆలోచిస్తున్నాను. అని చెప్పేసరికి కీర్తీ నిన్ను ఎవరు ఏమన్నా నన్ను అన్నట్లే, అయినా ఏమైనా అనాలంటే మా అమ్మనాన్నలు అనాలి. వేరెవరో అంటే నాకూ బాధగా ఉంటుంది కదా! అని బదులిస్తుంది. కానీ ఈ విషయం మా అమ్మానాన్నలకు సమయం చూసి నేనే చెప్తాను అంటుంది. వెంటనే చరణ్ కి ఫోన్ చేసి రెండు ఫ్లాట్లు రెడీ చేయమని చెప్తాడు. దానికి చరణే దగ్గర ఉండి రెడీ చేయించాలని అనుకుంటాడు. 

                  హరి పట్టణంలో ఫ్లాట్ తీసుకొవాలని తిరుగుతూ ఉన్న సమయంలో సర్పంచ్ సలహామేరకు శరత్ అపార్ట్ మెంట్ లో శరత్ వాళ్ళ ఎదురు ఫ్లాట్ నచ్చడంతో మంచిరోజు చూసుకొని రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పి ముందుగా కొంచెం ‌డబ్బులు ఇవ్వబోతే శరత్, చరణ్ లు మొత్తం ఒకేసారి తీసుకుంటామని చెప్పడంతో డబ్బు మనుషులు అని, మొత్తం త్వరగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటాడు. మనం మంచి చేస్తే మంచే తిరిగి మనకి చేరుతుందంటారు. అదేవిధంగా హరి చేసిన మంచి పనులకు అనుకున్నట్లుగా బదిలీ వస్తుంది. ఆ విషయం  తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఆరోగ్యం బాగోలేక పొయినా  హరి ఇంటికి వెళ్ళి నీ విషయంలో దురుసుగా ప్రవర్తించి తప్పు చేసానని క్షమాపణ చెప్పి ఇక్కడే ఉండమని చెప్పి వెళ్తాడు. హరి సంశయంలో పడతాడు. కానీ ఎవరు బదిలీ గురించి  ఏమి మాట్లాడినా మౌనం అర్ధాంగీకారం అన్నట్లు తల ఊపుతూ ఉంటాడు. 

               అంతేకాకుండా హరికి అదృష్ట లక్ష్మియే భార్య లక్ష్మి రూపంలో వచ్చింది అన్నట్లు లక్ష్మికి మళ్ళీ ప్రెగ్నెన్సి రావడంతో అన్ని ఆనందాలు కలిసి ఒకేసారి వచ్చాయి. నేను బదిలీ కోరుకున్నాననే విషయం అందరికి తెలుసు. ఇప్పుడు మనం విందు ఏర్పాటు చేస్తే వెళ్ళిపోతున్నామని అనుకుంటారు. దానికి లక్ష్మీ ఇంతవరకు మనం మన బంధువులందరికి ఒక్కసారి కూడా విందు ఇవ్వలేదు. ఏదేమైనా ఇప్పుడు ఈ ఊరిలో ఉన్నా, లేకున్నా అందరికి విందు ఇవ్వాలని చెబుతుంది.

                 అనిల్ వాళ్ళ అమ్మకి రేపు సాయంత్రానికి వస్తానని చెప్పాడు. వస్తాడా? లేదా? విజయ, నారాయణల పరిస్థితి ఏమిటి? కీర్తి, వాళ్ళ తల్లిదండ్రులకు  చెప్తుందా? చెబితే దానికి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. హరి విందు ఏర్పాటు చేస్తాడా? లేదా?

 1. మిత్రులందరికీ ఒక విన్నపం. క్రింద పేర్కొన్న వాట్సాప్, మెసెంజర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు షేర్ చేయండి.

2. ఈ బ్లాగ్ లోని మంచీచెడులను, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

                        ధన్యవాదాలు,

                         మీ రవికాంత రెడ్డి.

4 comments:

Anonymous said...

Baagundi inkaa suspence penchaali janaalu appude intrust choopistaaru

Unknown said...

Fablous story sir

Unknown said...

Fantastic story sir

Unknown said...

Very good, All the best