వాల్మీకి రామాయణంలోని
అయోధ్య కాండ 100వ సర్గ
శ్రీరాముని రాజనీతిధర్మాలను బోధించుట:-
కచ్చిత్ తే సుకృతాన్యేవ కృతరూపాణి వా పునః।
విదుస్తే సర్వకార్యాణి న కర్తవ్యాని పార్థివాః ।। 21
భావం:- భరతా! నీవుుు చేపట్టిన కార్యములలో పూర్తియైనవి, దాదాపు పూర్తికానున్నవి మాత్రమే సామంతరాజులకు తెెెెలియుచున్నవి కదా! మున్ముందు నిర్వహింపదలచిన కార్యములను గురించి వారికి తెలియుటలేదు కదా!
కచ్చిన్నతర్కైర్యుక్త్వా వారే చాప్యపరికీర్తితాః।
త్వయా వా తవవామాత్యైః బుద్యతే తాత మంత్రితమ్ ।। 22
భావం:- నాయనా! నిశ్చయింపబడిన కార్యములను నీవు గాని, నీ మంత్రులు గాని ప్రకటింపకు ముందే ఇతరులు చర్చల ద్వారా గాని, ఇతరములైన ఉపాయముులచే గాని, ఊహలచే గాని తెలుసుకొనుట లేదు కదా!
కచ్చిత్ సహస్రన్మూర్ఖాణామ్ ఏకమిచ్చసి పండితమ్।
పండితో హ్యర్ధకృచ్చ్రేషు కుర్యన్నిశ్రేయసం మహత్।। 23
భావం:- భరతా! నీవు ఎక్కువ మంది మూర్ఖులతో చర్చించుట గాక సమస్త విషయములను ఎరిగిన ఒక పండితునితో మాత్రమే మంత్రాంగములు జరుపుచున్నావు కదా! ఎందుకంటే కార్యాయములందు చిక్కులు వచ్చినప్పుడు ఒక పండితుడు మాత్రమే సరైన సూచనలు ఇచ్చి, గొప్ప శ్రేయస్సును కలిగించడానికి తోడ్పడగలడు.
సహస్రాణ్యపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతిః।
అథవాప్యయుతాన్యేవ నాస్తి తేషు సహాయతా ।।24
భావం:- ఏ ప్రభువైనను మూర్ఖులకు వెయ్యిమందికి అంతమాత్రమే కాదు పదివేల మందికి ఆశ్రయమిచ్చినను సమయము వచ్చినప్పుడు వారి వలన ప్రయోజనము శూన్యము.
ఏకోऽస్య మాత్యో మేథావీ శూరో దీక్షలో విచక్షణః।
రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియమ్ ।। 25
భావం:- ఎదుటి వారి అభిప్రాయములను బాగుగా గుర్తించగలవాడును స్థిరబుద్ధియుు, సముచితంగా ఆలోచించుటలో సమర్ధుడు అయిన అమాత్యుడు ఒక్కడైనను రాజునకును, రాజపుత్రులకును మహాసంపదలను లభింపచేయగలడు.
కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మాధ్యమాః।జఘన్యాస్తు జఘన్యేషు భృత్యాః కోర్సు యోజితాః।।26
భావం:- ఉన్నతశ్రేణికి చెందినవారిని గొప్ప గొప్ప కార్యములయందును, మద్యస్థాయికి చెందిన వారిని సామాన్యకార్యములందును, నిమ్న స్థాయిని స్వల్ప కార్యములందును, నిమ్నస్థాయివారిని స్వల్పకార్యములయందును భృత్యులనుగా నియమించుచున్నావు కదా!
అమాత్యాన్ ఉపథాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్। శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్ త్వం నియోజయసి కర్మసు।। 27
భావం:- ప్రలోభాలకు లొంగనివారును, తరతరముల నుండి ఉన్నత పదవులను అలంకరించుచు వచ్చినవారును, త్రికరణశుద్ధి గలవారును, ఉత్తమోత్తమములను అయిన వ్యక్తులను ముఖ్య కార్యములయందును అమాత్యులనుగా నియమించుచున్నావు కదా!
కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజితప్రజమ్ ।
రాష్ట్రం తవానుజానంతి మంత్రిణః కైకయీసుత ।। 28
భావం:- ఓ భరతా! రాజ్యము నందలి ప్రజలను ఉద్విగ్న పరచు తీవ్రదండనలను విధించకుండ మంత్రులు నిన్ను నివారించుచున్నారు కదా!
కచ్చిత్ త్వాం నావజానంతి యాజకాః పతితం యథా।
ఉగ్ర ప్రతి గ్రహీతారం కామయానమివ స్త్రియః।। 29
భావం:- అక్రమమార్గంలో ద్వారా ధనము సంపాదించి, యజ్ఞములను చేయుటకు పూనుకొనిన పతితుని సదాచారసంపన్నులైన ఋత్విజులు తిరస్కరింతురు. బలాత్కారమునకు పూనుకొనిన కాముకున్ని స్త్రీలు ఎదిరిస్తారు కదా! అదేవిధంగా శిక్షార్హులుకాని వారినుండి దండోపాయముతో శిక్షాధనమును గ్రహించుటకు సిద్ధపడినచో నిన్ను ప్రజలు తిరస్కరింతురు. నీవు అట్లు చేయుటలేదు గదా! అనగా ఓ భరతా! ప్రజలకు అవమానము కలుగునట్లుగా అన్యాయముగా నీవు వారి నుండి సుంకములను గ్రహించుటలేదు కదా!
ఉపాయకుశలం వైద్యం భృత్య సందూషణే రతమ్।
శూరమైశ్వర్య కామం చ యో న హంతి స వధ్య తే।।30
భావం:- సామదానాది చతురుపాయములలో నేర్పరిని, కుటిల రాజనీతిలో రాటుతేలిన వాడును, విశ్వాసపాత్రులైన భృత్యులను తొలగించుటయందే నిమగ్నుడును, హత్యలకు వెనకాడనివాడును, రాజ్యాక్రమణకాంక్షగలవాడును అయిన పురుషుని వధింపనిచో రాజు అతనిచేతనే నిహగతుడగును లేదా రాజ్యభ్రష్టుడు అగును.
కచ్చిద్దృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచిః।
కులీనశ్చానురక్తశ్చ దీక్షకు సేనాపతిః కృతః।।31
భావం:- రాజసత్కారములతో సంతుష్టుడైయుండువాడును, శత్రువులను నిగ్రహింపగల సమర్థుడును, సేనావ్యూహములయందు చతురుడును, విపత్కరపరిస్థితులయందు ధైర్యముగానుండువాడును, పవిత్రముగా నుండెడివాడును, సద్వంశమున జన్మించినవాడును,రాజభక్తిగలవాడును, యుద్ధకార్యకుశలుడును అయిన వానిని సేనాధిపతిగా నియమించితివిగదా!
బలవంతశ్చ కశ్చిత్ తే ముఖ్యా యుద్ధవిశారదాః।
దృష్టపదానా విక్రాంతాః త్వయా సత్కృత్య మానితాః।।32
కచ్చిద్బలస్య భక్తం చ వేతనం చ యథోచితమ్।
సంప్రాప్తకాలం వాయువ్యం దదాసి న విలంబసే।। 33
కాలాతిక్రమాణాచ్చైవ భక్తవేతనయోర్భృతాః।
భర్తుఃకుప్యంతి దుష్యంతి సోऽనర్ధః సుమహాన్ స్మృతః।।34
భావం:- ఓ భరతా! నీ సేనలోని ప్రముఖయోధులు మిగులబలశాలురు, రణమొనర్చుటలో సమర్థులు, పరాక్రమవంతుడు అయినవారేనా? వారు బలపరీక్షలో నెగ్గినవారేనా? వారిని నీవు పారితోషికములతో సత్కరించుచున్నావా? భక్తులకు ఇచ్చెడి జీతభత్యముల విషయమున కాలాతిక్రమణము జరిగినచో వారు రాజునెడ కుపితులై ఆయనను తూలనాడుదురు. అది పెక్కు అనర్థములకు దారితీయును.
కచ్చిత్ సర్వేऽనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః।
కచ్చిత్ ప్రాణాంస్తవార్ధేషు సంత్యజంతి సమాహితాః।। 35
భావం:- మంత్రులు మొదలగు ప్రధానాధికారులు అందరూ ఉత్తమవంశములయందు జన్మించినవారేనా? వారు నీయెడ భక్తిశ్రద్ధలు గల్గియుందురా? వారు నీకొరకై ప్రాణములనొడ్డుటకైనను సిద్ధపడుదురా?
కచ్చిజ్ఞానపదో విద్వాన్ దక్షిణః ప్రతిభానవాన్।
యథోక్తవాదీ దూతస్తే కృషితో భరత! పండితః।। 36
భావం:- స్వదేశీయులును, ఇతరులభావములను గ్రహింపగలవారును, కార్యదర్శులు ను, సమయస్ఫూర్తిగలవారును, రాజసందేశములను యథాతథముగా తెలుపగలవారును, యుక్తాయుక్త విచక్షణ గలవారైన పురుషులనే విదేశములకు దూతలనుగా నియోగించుచున్నావా? (ఇంకా వుంది).
ఇక్కడ ఉన్న ప్రతి శ్లోకం యొక్క భావం వాల్మీకి రామాయణంలో నుండి తీసుకోబడింది.
మీరు నా website ని మళ్ళీ దర్శించాలనుకుంటే
www.manakathalu.in అని google లో వెతకండి. ధన్యవాదములు.
2 comments:
Super sir
Very nice
Post a Comment