పాదుకపట్టాభిషేకం మొదటిభాగం చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి. https://www.manakathalu.in/2021/02/part-1.html
పాదుకపట్టాభిషేకం రెండవభాగం చదవాలనుకుంటే ఈ క్రింది లింకును నొక్కండి. https://www.manakathalu.in/2021/02/blog-post.html
శ్రీరాముడు రాజనీతి ధర్మాలను బోధించుట:-
త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః వేత్సి తీర్థాని చారకైః ।। 37
భావం:- పరదేశముల విషయమున 18 మంది చొప్పున ఆయా తీర్థములు వారిని, స్వదేశ విషయమున 18 మంది రాజకార్యములను నిర్వహించే వారిని గుర్తించి, వారిలో ప్రతి ముగ్గురిపైన ఒక గూడచారిని నియమించి, ఆ కార్యకలాపములను ఎప్పటికప్పుడు నిశితముగా పర్యవేక్షించున్నావా?
కచ్చిద్వ్యపాస్తానహితాన్ ప్రతియాతాంశ్చ సర్వదా।
దుర్భలాననవజ్ఞాయ వర్తసే రిపుసూదన ।। 38
భావం:- శత్రుసంహారకుడవైన ఓభరతా! దేశము నుండి వెడలగొట్టిబడిన శత్రువు తిరిగి వచ్చినచో నీవు వారిని బలహీనులనుగా తలచి ఉపేక్షించుటలేదు కదా!
కచ్చిన్న లోకాయతికాన్ బ్రాహ్మణాంస్తాత! సేవసే।
అనర్థకుశలాహ్యేతే బాలాః పండితమానినః ।। 39
ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః।
బుద్ధిమాన్ వీక్షకీం ప్రాప్య నిరర్ధం ప్రవదంతి తే ।।40
భావం:- నాయనా! నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయటంలేదు కదా! ఎందుకంటేే వారు ఇతరుల బుద్ధులను, ఆలోచనలను పరమాత్మ నుండి దూరం చేయడంలో సమర్థులు. అంతేేేకాక వారిని వారు గొప్ప పండితులుగా ప్రశంసించుకుంటారు. వేేేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణేతిహాసాలయందు కూడా వారి మార్గము పెడమార్గము పట్టుచుండును. వారు ప్రత్యక్షప్రమాణములనే ఆశ్రయించి ప్రయోజనము లేనటువంటి శుష్కవాదమును చేయుచుందురు.
వీరైరధ్యుషితాం పూర్వమ్ అస్మాకం తాత! పూర్వకైః।
సత్యనామాం దృడద్వారాం హస్త్యశ్వరథసంకులామ్ ।।41
బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః స్వకర్మనిరతేః సదా ।
జితేంద్రియైర్మహోత్సాహైః వృతామార్యైః సహస్రశః।।42
ప్రసాదైర్వివిధాకారైః వృతాం వైద్యజనాకులమ్।
కచ్చిత్ సముదితాం స్ఫీతామ్ అయోధ్యాం పరిరక్షసి।।43
భావం:- భరతకుమారా! మన పూర్వీకులు అసహాయశూరులు వారికి నెలవగుటచే మన అయోధ్యనగరము శత్రుదుర్భేద్యమైనది. సార్థకనామధేయము గలది. నలువైపులా మిక్కిలి దృఢమైన ద్వారములు కలది. రథాశ్వగజబలములతో సర్వదా నిండియుండును. ఆ పురమునందు వేలసంఖ్యలోగల బ్రాహ్మణులును, క్షత్రియులును, వైశ్యులును నిరంతరము తమతమ ధర్మ కర్మలయందుు నిరతులై యుందురు. వారు జితేంద్రియులు, వారికార్యోత్సాహములు నిరుపమానములు, కనుక వారు ఎల్లరును పూజ్యులు, అందలి వివిధాకారములుగల రాజభవనములు, మందిరములు ఆ నగరశోభను ఇనుమడింపజేయుచుండెను. అది యెల్లప్పుడును అసంఖ్యాకులైన విద్వాంసులతో కలకలలాడుచుండును. అది సమస్తసంపదలకును నెలవైనది. అందలి ప్రజలసుఖసంతోషములకు అవధియుండదు. అట్టి అయోధ్యానగరమును నీవు చక్కగా పరిరక్షించుచున్నావు గదా?
కచ్చిచ్చైత్యశతైర్జుష్టః సునివిష్టజనాకులః।
దేవస్థానైః ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితః।। 44
ప్రహృష్టనరనారికః సమాజోత్సవశోభితః ।
సుకృష్టసీమా పశుమాన్ హింసాభిః పరివర్జతః ।। 45
అదేవమాతృకో రమ్యం శ్యాపధైః పరివర్జితః ।
పరిత్యక్తో భయైః సర్వైః ఖనిభిశ్చోపశోభితః ।। 46
వివర్జితో నరైః పాపైః మమ పూర్వైః సురక్షితః ।
కచ్చిజ్జనపదః స్ఫీతః సుఖం వసతి రాఘవ ।।47
భావము - నాయనా! భరతా! మనకోసలదేశము అశ్వమేధాదిమహాయజ్ఞములను ఆచరించిన పవిత్రప్రదేశములుగలది. తరతరాలప్రజలకు ఆయురారోగ్య భాగ్యములను కొల్లలుగా పంచియిచ్చుచున్న దివ్యభూమి అది. ప్రజలకు భక్తిప్రపత్తులను పెంపోందజేయు దేవాలయములు అందు కోకొల్లలు. బాటసారులదాహములనుదీర్చుచు వారికి హాయినిగూర్చెడి చలివేంద్రములు అందు అసంఖ్యాకములు. అందలి తటాకములు ప్రజలస్నానపానాది అవసరములను దీర్చుచు కనువిందుగావించుచుండును. స్త్రీపురుషులెల్లరును సుఖసంతోషములతో హాయిగానుందురు. ధర్మనిర్ణయసభలతోడను, సమాజమునకు సంబంధించిన ఉత్సవములతోడను అది విలసిల్లుచుండును. పంటభూములతోడను, పశుసంపదలతోడను వర్థిల్లుచుండునది. ఎట్టి హింసాకృత్యములకును అచట తావు ఉండదు. ( అందలి ప్రజలు మద్యమాంసములను ఏమాత్రమును ముట్టరు.) వర్షములమీదమాత్రమే ఆధారపడక ఇతరనదీజలసౌకర్యములతో సస్యశ్యామలమై అది రమణీయముగా ఒప్పుచుండును. పెద్దపులులు మెదలగు క్రూరజంతువులబాధలు లేనట్టిది. అగ్నిభయము, చోరభయము మొదలగుబాధలకు అందు చోటులేదు. అది వివిధఖనిజసంపదలకు కాణాచి. అందు పాప కృత్యములను చేసెడివారు మచ్చునకైనను కానరారు.అది మన పూర్వుల రక్షణలో సురక్షితముగానున్నది. అట్టి కోసలదేశమునందలి ప్రజలు ధనధాన్యసంపదలతో తులతూగుచు సుఖశాంతులతో వర్థిల్లుచున్నారుగదా?
కచ్చిత్ తే దయితాః సర్వే కృషిగోరక్షజీవినః ।
నార్తాయాం సంశ్రితస్తాత! లోకో హి సుఖమేధతే ।। 48
భావము - వ్యవసాయము, పశుపాలనము, వాణిజ్యము మొదలగు వృత్తులతో జీవించువైశ్యులు నీకు ప్రీతిపాత్రులైయున్నారా? ఏలనన క్రయవిక్రయాది వ్యాపారములవృద్ధివలననేగదా దేశము సుఖశాంతులతో వర్థిల్లునది?
తేషాం గుప్తిపరీహారైః కచ్చిత్ తే భరణం కృతమ్।
రక్ష్యా హి రాజ్ఞాధర్మేణ సర్వే విషయవాసినః ।। 49
కచ్చిత్ స్త్రియః సాంత్వయసి కచ్చిత్ తాశ్చ సురక్షితాః।కచ్చిన్న శ్రద్దధాస్యాసాం కచ్చిద్గుహ్యం న భాషసే।। 50
భావము - ఆ వైశ్యులకు ఇష్టములను గూర్చుచు, ఎదురైన ఆపదలను నివారించుచు వారినందరిని బాగుగా రక్షించుచున్నావుగదా? ఏలనన దేశప్రజలను అందరిని చక్కగా రక్షించుట రాజధర్మము సుమా! ఓభరతా! నీఅంతఃపురస్త్రీలు సంతోషముతోనుండునట్లు విచారించుచు వారిరక్షణభారమును పూర్తిగా వహించుచున్నావు గదా? రహస్య విషయములను వారికి తెలుపుటలేదుగదా?
కచ్చిన్నాగవనం గుప్తం కచ్చితంగా తే సంతి ధేనుకాః ।
కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణాం చ తృప్యసి ।। 51
భావము - ఏనుగులవనమును చక్కగా రక్షించుచున్నావా? (లేనిచో వాటికి అపహరించుకొనిపోవుదురు.) అసంఖ్యాకములైన పాడియావులను, అశ్వములను పోషించుచు వాటిసంఖ్యను పెంచుచున్నావుగదా?
కచ్చి ద్దర్శయసే నిత్యం మనుష్యాణాం విభూషితమ్।
ఉత్థాయోత్థాయ పూర్వా హ్ణే రాజపుత్ర! మహాపథే ।। 52
భావము - ఓరాజకుమారా! నీవు ప్రతిదినము ప్రాతఃకాలముననే లేచి చక్కగా అలంకరించుకొని, రాజమార్గమునందు పౌరులకు దర్శనమిచ్చుచున్నావు గదా?
కచ్చిన్న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాస్తేऽవిశంకయా ।
సర్వే వా పునరుత్సృష్టా మధ్యమేవాత్ర కారణమ్।। 53
భావము - నీరాజ్యములోని ఉద్యోగులందరును జంకుగొంకులులేక నిన్ను పూర్తిగా సమీపించుటలేదుగదా? లేక వారెల్లరును మిగుల భయపడుచు నీకు దూరముగా ఉండుటలేదుగదా? ఉద్యోగుల విషయమున మధ్యేమార్గమును అవలంబించుటయే శ్రేయస్కరము. అనగా వారికి పూర్తిగా చనవు ఇచ్చుటగాని, వారిని బొత్తిగా దూరమున ఉంచుటగాని తగదు.
కచ్చిత్ సర్వాణి దుర్గాణి ధనధాన్యయుధోరకైః।
యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పిధనుర్ధరైః ।। 54
భావము - నాయనా! నీదుర్గములన్నియును ధనధాన్యములతోడను, అస్త్రశస్త్రములతోడను, జలములతోడను, యంత్రములతోడను, శిల్పులతోడను, (యంత్రచోదకులతోడను) ధనుర్ధారులైన యోధుల తోడను ఒప్పుచున్నవిగదా?
ఆయస్తే విపులః కచ్చిత్ కచ్చిదల్పతరో వ్యయః।
అపాత్రేషు న తే కచ్చిత్ కోశో గచ్ఛతి రాఘవ ।। 55
భావము - ఓభరతా! నీరాజ్యాదాయము పుష్కలముగానున్నదా? ధన (కోశ) వ్యయము (ఆదాయమునకులోబడి) పరిమితముగానున్నదా? ధనమును అపాత్రులకై వినియోగించుటలేదుగదా ? (నట, నర్తక, గాయకులు మొదలగువారికై విచ్చలవిడిగా వ్యయమగుటలేదు గదా?) ఇంకావుంది--
No comments:
Post a Comment