Breaking

Tuesday, November 28, 2023

ధనుర్భంగం

 धनुर्भङ्गः इति पाठ्यभागस्य सारांशं लिखत ।

कविपरिचयः  - ప్రస్తుత  धनुर्भङ्गः అను పాఠ్యభాగం ఆదికవి వాల్మీకి మహర్షిచేత రచించబడిన ఆదికావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్రామయణంలోని బాలకాండ 67వ సర్గనుండి స్వీకరింపబడినది.


ग्रन्थप्राशस्त्यम् -  వాల్మీకి మహర్షిచేత రచించబడిన రామాయణం ఇరవైనాలుగువేల శ్లోకాలతో ఏడుకాండలతో భారతీయ సాహిత్యానికి నిట్టనిలవెత్తు నిదర్శనం. ఈ గ్రంథం ద్వారా మానవుడు నైతిక విలువలతో, ఇంద్రియ నిగ్రహంతో రామునిలా జీవించాలి అని ఒక స్వరూపాన్ని సూచించాడు.

पूर्वकथा - జనకుడు రామలక్ష్మణులను చూచి, వారి వంశం గురించి తెలుసుకొని విశ్వామిత్రునితో వారికి శివధనస్సుని చూపిస్తాను. రాముడు శివధనస్సును ఎక్కుపెట్టినట్లయితె సీతను ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు.

प्रस्तुतकथा - జనకుని మాటను విన్న విశ్వమిత్రుడు రామునికి విల్లు చూపమని కోరాడు. అప్పుడు జనకుడు పూలు, గ్రంధంతో అలంకరించిన ధనస్సుని తీసుకురమ్మని మంత్రులను ఆజ్ఞాపించాడు. జనకునిచే ఆజ్ఞాపించబడిన మంత్రులు ఊళ్ళోకి వెళ్ళి ధృఢమైన శరీరం కలిగిన ఐదు వేల మంది ఎనిమిది చక్రాలు ఉన్న ఒక పెద్ద పెట్టెను అతి కష్టంగా తీసుకొని వచ్చిరి.  అప్పుడు మంత్రులు జనకునితో రాజా! మీచే ఆజ్ఞాపించబడిన మరియు రాజులందరూ పూజించే ఆ ధనస్సుని తేచ్చాము అని పలుకగా జనకుడు విశ్వామిత్రునికి నమస్కరించి ఇలా పలికెను.

ధనస్సు గొప్పతనము - ఈ ధనస్సు విదేహ రాజులందరిచేత పూజింపబడినది. పరాక్రమవంతులైన రాజులెందరో కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ధనస్సుని ఎక్కుపెట్టడానికి, అల్లెత్రాడు తగిలించడానికి, బరువు చూడటానికి, విరచడానికి దేవతలు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు మరియు నాగులు వంటి వారు కూడా ధనస్సుని ఎక్కుపెట్టలేకపోయారు. ఇక ఈ మానవుల గురించి చెప్పేదేమున్నది అంటూ, విశ్వామిత్రునితో ఓ మహర్షీ! ఈ ధనస్సుని నీ వెంట వచ్చిన ఇద్ధరు రాజపుత్రులకి చూపించమని పలికెను.

విశ్వామిత్రుని ఆజ్ఞ - జనకుని మాటను విశ్వామిత్రుడు, రామునితో సహా అందరూ విన్నారు. అప్పుడు విశ్వామిత్రడు రామునితో రామా! ధనస్సుని చూడుము. అని పలికెను. మహర్షి ఆజ్ఞను అనుసరించి ధనస్సు ఉంచిన పెట్టె దగ్గరికి వెళ్లి పెట్టెను తెరచి విల్లుని చూచి  ఈ ధనస్సును చేతితో తాకుతాను. దీని బరువు చూడటానికి గానీ, ఎక్కుపెట్టడానికి గానీ ప్రయత్నిస్తాను అని పలికెను.

ధనుర్భంగము - ఆ మాటలకు విశ్వామిత్రుడు నీ ప్రయత్నం నీవు చెయ్యమని చెప్పడంతో శ్రీరాముడు ఆ దివ్యమైన ధనస్సుని మధ్యభాగంలో పట్టుకొని అలా అవలీలగా పైకెత్తి, అల్లెత్రాడుని తగిలించి, ఆ  ధనస్సు విరిగేటట్లుగా వింటినారిని తన చెవులవరకు లాగి వదిలెను.

                                ఆ ధనస్సు విరిగేటప్పుడు భూమి కంపించడంతో పాటు పర్వతాలు బద్ధలైనట్లు వచ్చిన శబ్ధానికి జనకుడు, విశ్వమిత్రుడు మరియు రామలక్ష్మణులు తప్ప మిగతా వారందరూ మూర్చిల్లారు. జనం కొంచెం తేరుకున్నాక జనకుడు విశ్వామిత్రునితో మహాత్మా! ఈ ధనుర్భంగ మహాకార్యం నా ఊహకు అందనిది. నేను ఆశించనిది. అత్యద్భుతమైనది. ఈ కార్యంతో రాముని పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసాను. కాబట్టి సీతను రామునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను. రామున్ని భర్తగా పొందిన నా కుమార్తె వలన జనక వంశానికి ఇంకా గొప్పదైన కీర్తి లభించును.

     ఓ మహాత్మా! నా ప్రతిజ్ఞ ఈ రోజు నెరవేరింది. నీవు అనుమతినిస్తే ఈ క్షణమే నా మంత్రులను అయోధ్యకు పంపి విశ్వామిత్రుని సంరక్షణలో రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారని తెలియజేసి దశరథుడిని మిథిలకు తీసుకవస్తారని తెలపగా విశ్వామిత్రుడు కూడా దానికి అంగీకరించెను.

ముగింపు - జనకుడు తన ఆజ్ఞను చక్కగా పాటించే మంత్రులను అయోధ్యకు పంపి దశరథున్ని మిథిలకు తీసుకురమ్మని ఆజ్ఞాపించెను.

3 comments:

rekkapogula said...

hi sir myself kulasekhar from gooty. i followed ur sanskrit videos from inter and i also got 98 and 99 marks in sanskrit language.
And i requesting u sir please post new sku university sanskrit model paper

Srinivas said...

Kulasekhar link ikkada pedutunnanu click chey neevu youtube lone msg chey nenu reply istaanu.
https://youtu.be/wzreNwsxkEw

Srinivas said...

Sk University model paper degree 1st semester sanskrit:
https://youtu.be/wzreNwsxkEw